Home  »  TV News  »  అగ్రిమెంట్ పూర్తయిందని చెప్పిన కృష్ణ.. రేవతి ఏం చేయనుంది!

Updated : Aug 27, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -246 లో.. మురారికి కృష్ణ తినిపిస్తూ తనకి దగ్గరగా ఉంటుంది. కృష్ణ చూపించే ప్రేమకి మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని నడిపిస్తూ మురారి పక్కనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు. 

ఆ తర్వాత కృష్ణ కొద్ది దూరాన నిల్చొని.. మీరు మెల్లి మెల్లిగా నా దగ్గరికి రండి అని మురారిని నడవమని చెప్తుంది. మురారి దగ్గరగా వెళ్లిన కొద్ది కృష్ణ వెనక్కి జరుగుతుంది. ఈ ఆట కూడా నా జీవితం లాగే ఉంది కృష్ణ.. నేను నీకు దగ్గరగా వస్తుంటే నువ్వు దూరంగా వెళ్తున్నావని మురారి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత మురారి నడవడంలో ఎంకరేజ్ చెయ్యడానికి కృష్ణ కో డాక్టర్స్, కాని స్టేబుల్స్ వస్తారు. అప్పుడే రేవతి క్యాంపు దగ్గరికి వస్తుంది. మురారిని ఆ సిచువేషన్ లో చూసిన రేవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమైంది మురారి అంటూ బాధపడుతు వస్తుంది. ఒక డాక్టర్ జరిగిందంతా రేవతికి చెప్తుంది. మీరేం టెన్షన్ పడకండని రేవతికి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ మురారిలది అగ్రిమెంట్ గడువు ఈ రోజుకే లాస్ట్ అని కృష్ణ బాధపడుతుంది. మురారి దగ్గరే కృష్ణ రేవతి ఉంటారు. మురారిని ఈ సిచువేషన్ లో చూస్తున్నందుకు  బాధగా ఉందని రేవతి అంటుంది. మా అగ్రిమెంట్ ఈ రోజుతో పూర్తి అవుతుందని అత్తయ్యకి చెప్పాలని కృష్ణ అనుకొని.. అత్తయ్య మీతో మాట్లాడాలని పక్కకి తీసుకొని వెళ్తుంది. మీకో విషయం చెప్పాలని కృష్ణ ఇబ్బంది పడుతుంటుంది. అగ్రిమెంట్ గురించి అని కృష్ణ అనగానే.. ఇంకా మర్చిపోలేదా.. అగ్రిమెంట్ లేదు, ఏం లేదు నేను ఉన్న కోపంలో నువ్వు అగ్రిమెంట్ అంటూ మాట్లాడితే చెంప చెళ్లుమనిపిస్తానని కృష్ణకి రేవతి వార్నింగ్ ఇస్తుంది. నాకు వెళ్ళాలని లేదు అత్తయ్య కానీ మీ అబ్బాయి మనసులో నేను లేనని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఈ రోజుతో నా అగ్రిమెంట్ పూర్తి అవుతుంది. నేను రేపు మా ఊరు వెళ్తున్నానని కృష్ణ చెప్పి వెళ్తుంది. మీ ఊరు వెళ్తే నేను రాలేనా వచ్చి నిన్ను తీసుకువస్తానని రేవతి అనుకుంటుంది.

మరొక వైపు కృష్ణని పిలుస్తు మురారి వస్తాడు. కృష్ణ ఎక్కడ అని రేవతిని మురారి అడుగుతాడు. రేవతి పట్టించుకోనట్లు టిఫిన్ తీసుకొని రావాలా అని అడుగుతుంది. అమ్మా నేనేం అంటున్నాను, నువ్వేం అంటున్నావని మురారి అంటాడు. కృష్ణ అగ్రిమెంట్ పూర్తయిందట కదా, అందుకే ఊరు వెళ్తుందట అని రేవతి చెప్పగానే.. నీ కొడుకు భార్య అలా వెళ్ళిపోతే, నా కొడుకుని వదిలిపెట్టి వెళ్తున్నావ్ ఎందుకు అని నువ్వు అడగవా అని మురారి అంటాడు. మీకు ఒకరిపై ఒకరికి ఇష్టం లేనప్పుడు నేనెందుకు అడుగుతానని రేవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.